సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతను కొనసాగించేందుకు అనుమతించింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుదాకర్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై గత వారం రోజులుగా సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు..కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్న.. పిటిషనర్ల అబిప్రాయంతో కోర్టు ఏకీభవించలేదు. తాజాగా కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం చెప్పడంతో పిటిషన్‌ను రద్దు చేస్తూ..సచివాలయ నిర్మాణాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో.. తిరిగి సచివాలయ కూల్చివేత పనులు కొనసాగనున్నాయి.