తెరపైకి కొత్త వైరస్

కరోనా వైరస్ గజ గజ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కొత్త వైరస్ ని తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ‘నిరాక’ని కనిపెట్టారు. చంద్రబాబు బ్యాచ్ కి ‘నిరాక’ వైరస్ సోకిందని విజయసాయి ట్విట్ చేశారు.

“బాబు బాచ్ కి ‘నిరాక’ ఈ వైరస్ లక్షణాలు.. నిజాలు చెప్పకపోవడం, విపత్తులనూ రాజకీయం చేయడం, సంక్షేమాన్ని ఓర్చుకోలేని కడుపు మంట. ఐతే ఈ వైరస్ తో ప్రమాదం లేదు. ఎందుకంటే ఈ వైరస్ కి  ఏడాది క్రితమే స్వయంగా ప్రజలే వ్యాక్సిన్ కనుక్కున్నారు” అంటూ విజయసాయి తనదైన శైలిలో సటైరికల్ ట్విట్ చేశారు.

అంతకుముందు టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలవడంపై కూడా విజయసాయి ట్విట్ చేశారు. “రాష్ట్రపతికి కంప్లైంట్లు పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టారు.నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు,అవినీతిపరులను అరెస్ట్  చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు,శాంతి  భద్రతలు క్షిణించినట్లు అంట.మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి” అంటూ ట్విట్ చేశారు.