నితిన్ ఫాలోయింగ్ @3మిలియన్

జయం-అపజయం రెండూ చూసిన హీరో నితిన్. కెరీర్ మొదట్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్నాడు. ఆ తర్వాత కెరీర్ గాడి తప్పి ఏకంగా డజనుకి పైగా ప్లాపులు చవి చూశాడు. ఇక నితిన్ పనైపోయింది అనుకున్నారు. ఇంతలో ‘ఇష్క్’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు. మళ్లీ వరుసగా విజయాలు అందుకున్నారు. హిట్టు-ప్లాపుతో సంబంధం లేకుండా ప్రేక్షకులని అలరిస్తున్నాడు నితిన్.

ఈ క్రమంలో నితిన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా నితిన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 3 మిలియన్ దాటింది. దీనిపై నితిన్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. 3 మిలియన్ స్ట్రాంగ్. ఆనందంగా ఉందంటూ ట్విట్ చేశారు. అభిమానులకి థ్యాక్స్ చెప్పాడు. ఈ యేడాది ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నితిన్. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నట్టు.. వచ్చే నెలలోనే నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నితిన్‌ తన స్నేహితురాలు షాలినిని పెళ్లాడబోతున్నాడు.