రజనీ జెండా-అజెండా.. కొత్త ముహూర్తం ఖరారు !

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. కేవలం ప్రకటన మాత్రమే చేశారు. రాజకీయాల్లోకి వస్తా. ప్రజాసేవ చేస్తానిని ప్రకటించారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన చేసి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికీ రజనీ పార్టీ ఏంటో తెలీదు. ఆయన జెండా-అజెండా ఏంటో తెలీదు.

ఈ నేపథ్యంలో రజనీ రాజకీయ జీవితం ఎంట్రీ ఇవ్వక ముందే ముగిసేలా ఉందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ పొలిటికల్ ఎంట్రీపై కొత్త ముహూర్తం ఫిక్సయినట్టు సమాచారమ్. వాస్తవానికి మార్చిలోనే రజనీ పార్టీ ప్రకటన  జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదాపడింది. ఆగస్టులో అనుకున్నా.. అప్పటికీ కరోనా ప్రభావం తగ్గేలా లేదు. ఈ నేపథ్యంలో నవంబర్ లో రజనీ పొలిటికల్ ఎంట్రీపై పూర్తి క్లారిటీ రానుంది. పార్టీ పేరు, జెండా-అజెండా ప్రకటించి.. రజనీ పూర్తిస్థాయిలో పొలిటిక్స్ లోకి దిగబోతున్నారని సమాచారమ్.