గోదావరి జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీ 3963 కొత్త కేసులు నమోదయ్యాయ్. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని 994 కేసులు నమోదయ్యాయ్. దీంతో గోదావరి జిల్లాల్లో 24గంటల కర్ప్యూ విధిస్తున్నట్టు కలెక్టర్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు.

తూ. గోలో రెండ్రోజుల్లోనే వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయ్. అలాగే వదిలేస్తే జిల్లాలో కరోనా విశ్వరూపం చూపించేలా ఉంది. అందుకే 24గంటల కర్ఫ్యూని విధించారు. కర్ఫ్యూ టైమ్ లో అత్యవసర వైద్య సేవలు, మెడికల్ షాపులు తప్ప.. అన్నీ మూతపడనున్నాయ్. కర్ఫ్యూ నిబంధనలు ధిక్కరించిన వారిపై ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.