‘డర్టీ హ‌రి’ ట్రైలర్ టాక్ 

ఎంఎస్.రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి , సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డర్టీ హరి’. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్. పోస్ట‌ర్లు, అందులో హీరో, హీరోయిన్లు పెట్టుకుంటున్న లిప్ లాక్కులు చూస్తుంటే సిని‌మా అంతా హాట్ హాట్ గా ఉండ‌బోతోంద‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ తో సినిమా ఎంత డర్టీగా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు.

సునీల్ వాయిస్ ఓవర్ తో శ్రవణ్ రెడ్డి రొమాన్స్ తో ట్రైలర్ ఆకట్టుకొనేలా కట్ చేసారు. జీవితంలో ఈ 5 రూల్స్ పాటించమని సునీల్ చెప్పడం. వాటిని బ్రేక్ చేస్తూ.. హీరో రెచ్చిపోవడం ట్రైలర్ లో చూడొచ్చు. అయితే ట్రైలర్ లో రొమాన్స్ ని మాత్రమే చూపించారు. దానికి వెనక థ్రిల్ చూడాలంటే సినిమా చూడాల్సిందే.