పవన్ నుంచి డబుల్ ట్రీట్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే. దానికి ఇంకా నెలన్నర టైముంది. అయితే పవన్ అభిమానులు మాత్రం అప్పుడే సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు. #AdvanceHBdPawanakalyan యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో వైరల్ చేశారు. అది సరికొత్త రికార్డులు సృష్టించింది. 24గంటల్లో 23మిలియన్ ట్విట్స్ సొంతం చేసుకొంది.

ఇక బర్త్ డే కానుకగా పవన్ నుంచి రెండు బహుమతులు రాబోతున్నాయి. ‘వకీల్ సాబ్’తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ ఫస్ట్ లుక్, ఓ పాట వచ్చాయి. పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ‘వకీల్ సాబ్’ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా ‘బందిపోటు’ (వర్కింగ్ టైటిల్) నుంచి కూడా అప్ డేటు రానుంది. టైటిల్ పోస్టర్ తో పాటు పవన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి బర్త్ డే రోజున పవన్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారన్న మాట. ఈ విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు.