తెలంగాణలో కరోనా తగ్గుముఖం ?

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా ? రెండు, మూడు రోజులుగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యని చూస్తే అదే అనిపిస్తోంది. ఆ మధ్య ప్రతిరోజూ 2వేలు, ఆ పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య రెండ్రోజుల నుంది 1500ల లోపే నమోదవుతున్నాయ్. నిన్న తెలంగాణలో 1296 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 6గురు మృతి చెందారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా తగ్గుతుందనే అర్థవుతోంది. అయితే కొత్త కేసుల సంఖ్య చేస్తున్న టెస్టుల ఆధారంగా నమోదవుతుందని తెలుస్తోంది. ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ కొత్త కేసులు, తక్కువ టెస్టులు చేస్తే తక్కువ కేసులు నమోదవుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో టెస్టులు తక్కువ చేస్తున్నారనే ఆరోపణలున్నాయ్. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం టెస్టుల సంఖ్యని కూడా పెంచింది.

ఇక ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కి చేరింది. కరోనా సోకి మొత్తం 415 మంది చనిపోయారు. ఇప్పటివరకూ కోలుకుని 32,438 మంది డిశ్చార్జు కాగా ఆదివారం 1831 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.