సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తాం !

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ‘పవర్ స్టార్’ సినిమాతో పవన్ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రచార చిత్రాలతోనే పవన్ గాలి తీస్తున్న వర్మ.. సినిమాలో ఇంకెన్ని దారునాలు చేయబోతున్నాడు అనేది అర్థం కావడం లేదు. అయితే వర్మని లైట్ తీసుకోమని స్వయంగా పవనే చెప్పిన.. అభిమానులు ఆగడం లేదు. ‘పరాన్నజీవి.. ఆర్జీవి’ పేరిట ఓ పాటని తీసుకొస్తున్నారు.

తాజాగా దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. వర్మ దారిలోనే.. ఆయనకి గట్టి కౌంటర్ ఐసీసీ ప్రయత్నం చేశారు. బ్లాక్ అండ్ రెడ్ పోస్టర్ లో వర్మ పోస్టర్ ని వదిలారు. దీనిపై “మాది దాడి  కాదు.. ప్రతిదాడి. వ్యూహాం కాదు ప్రతివ్యూహాం. బకరాలతో ఆడుకుంటే.. నీకు బిర్యానీ దొరకొచ్చు. సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తాం” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.