పరాన్నజీవి సాంగ్.. కేకో కేక !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతి దాడికి దిగారు. ‘పవర్ స్టార్’ టైటిల్ తో పవన్ కల్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘పరాన్నజీవి’ పేరుతో ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అదిరిపోయింది. వర్మ దారిలోకి వెళ్లి ఆయన స్టయిల్ లో రెడీ చేసిన సాంగ్ ఇది.

వర్మ నీతినికృష్ట పనులన్నీ ఇందులో పేర్కొన్నారు. ‘జీవి జీవి ఇది పరాన్నజీవి. నీతిలేని ఓ నిశీది జీవి. జీవి నిర్జీవి – అతడే ఆర్జీవి. పచ్చినెత్తురు మరిగిన జీవి.. పచ్చి బూతులు మొరిగే జీవి. చచ్చినవాడిని వదలని జీవి. బతికిన్నోడిని చంపే జీవి. ఉచ్చం నీచం ఎరుగని జీవి. వృత్తిని తార్చే వికృత జీవి.. ‘ అంటూ సాగింది. పరాన్నజీవి కేకో కేక అంటున్నారు పవన్ ఫ్యాన్స్.