ఇష్టం లేని యుద్ధం చేస్తున్న పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ యుద్ధంలోకి దిగితే ఇక అంతే సంగతులు. ఎదుటివారు ఎంతటివారైనా.. జంకాల్సిందే. కానీ పవన్ ఫ్యాన్స్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఏం పీకలేకపోతున్నారు. ‘పవర్ స్టార్’ టైటిల్ తో పవన్ ఓ సినిమా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎన్నికల తర్వాత జరిగిన కథ’ అంటూ పవన్ పరువు తీస్తే కార్యక్రమం పెట్టుకున్నాడు వర్మ. సినిమా ప్రమోషన్స్ లోనే పవన్ గాలి తీసేస్తున్నాడు. ఇక సినిమాలో ఏకంగా రేప్ చేసేలా ఉన్నాడు. 

తాజాగా పవర్ స్టార్ సినిమా నుంచి ‘గడ్డి తింటావా.. ‘ పాటని రిలీజ్ చేశాడు పవన్. ఇందులో పవన్ ని బర్రెతో పోల్చాడు. అంతేకాదు.. వెన్నుపోటుదారుల వలన ఎన్నికల్లో ఓడిపోయినట్టు పవన్ కుంగిపోయినట్టు చూపించారు. ఈ పాటకి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 56k లైకులు సొంతం చేసుకొంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం డిస్ లైకులతో వర్మకి బుద్ది చెబుతామని ఇష్టం లేని యుద్ధం మొదలెట్టారు. అయితే ఇప్పటి వరకు ఈ పాటకు 38k అన్ లైకులు మాత్రమే వచ్చాయ్. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ పై వర్మ గెలిచినట్టు విర్రవీగుతున్నాడు. పవన్ కవ్విస్తూ.. పోస్టులు పెడుతున్నారు. మరీ.. ఇష్టం లేని యుద్ధంలో ఆలస్యమైన పవన్ ఫ్యాన్స్ గెలుస్తారేమో చూడాలి.