వర్మకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్ !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై పడిపోయిన సంగతి తెలిసిందే. ‘పవర్ స్టార్’ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. పవన్, అతని స్నేహితులు, ఫ్యామిలీని పోలిన మనుషులతో జెడ్ స్వీడుతో పవర్ స్టార్ సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు. ఈ వారమే (జులై 25) రిలీజ్.

ఈ నేపథ్యంలో వర్మని టార్గెట్ చేశారు పవన్ ఫ్యాన్స్. ‘పరాన్నజీవి ఆర్జీవి’ పేరిట ఓ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు రాత్రి 8:20కి రిలీజ్ చేయబోతున్నట్టు ఓ పోస్టర్ ని వదిలారు. ఈ పాటకు ‘రెక్ లెస్ జెనెటిక్ వైరస్’ అనే సబ్ టైటిల్ పెట్టారు. ప్రసుత్తం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ తో పాటు.. ఆర్జీవీ అభిమానులు కూడా ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఎందుకంటే ? అది ఏరకమైన ప్రచారమైన ఆర్జీవి, అతని అభిమానులు ఇష్టపడతారు కదా. మరోవైపు, పవన్ ఫ్యాన్స్ వర్మకి మంచి చేస్తున్నారు. పవర్ స్టార్ రిలీజ్ కి ముందు స్పందించడం సినిమాకి కలిసి వస్తుందని చెప్పుకొంటున్నారు.