అమ్మకానికి ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్

కరోనా కారణంగా సినీ పరిశ్రమ మూగబోయింది. షూటింగుల్లేవ్. కొత్త సినిమాల విడుదల లేదు. శుక్రవారం హంగామా లేదు. చాలా తక్కువ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయ్. అయితే సంచల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం గతంలో కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు బాగా సంపాదిస్తున్నారు. ఇప్పటికే వర్మ నుంచి ‘క్లైమాక్స్‌’, ‘నేక్డ్’, ‘కరోనా వైరస్‌’ వంటి చిత్రాలను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చాయ్. ఈ వారం (జులై 25) ‘పవర్ స్టార్’ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు వర్మ.

పవర్ స్టార్ సినిమాతో వర్మ కొత్త ఆలోచనకి తెరలేపిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ట్రైలర్ ని అమ్మకానికి పెట్టాడు. ఒక్కసారి ట్రైలర్ ని చూడాలంటే రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు మారాయ్. సినిమా ఆన్ లైన్ కి అలవాటు పడింది. మనం కూడా మారాలి అంటూ వర్మ దర్శకధీరుడు రాజమౌళికి ఓ విలువైన సూచనలు చేశాడు వర్మ. 

‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ని కూడా అమ్మితే భారీ డబ్బులు వస్తాయి. రూ. 150 నుంచి రూ. 200 పెట్టిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ చూస్తారు. కేవలం ట్రైలర్ తోనే సినిమా బడ్జెట్ మొత్తం వచ్చేస్తోంది. నిర్మాతకు మేలు జరుగుతోంది. ఇక సినిమాతో వచ్చే డబ్బు మొత్తం లాభాలే కిందే అవుతుందని వర్మ అన్నారు. వర్మ సూచనతో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ని అమ్మకానికి పెడతారేమో చూడాలి.