సూపర్ స్టార్ మాస్క్ ప్రచారం
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారికి మందు లేదు. ఇప్పట్లో కంట్రోల్ అయ్యేలా లేదు. కరోనాతో సహజీవవనం చేయక తప్పదు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తల ద్వారా కరోనాని మన దరించి చేరకుండా చూసుకోవచ్చు. దానికి చేతులని శుభ్రంగా కడుక్కోవడం, తప్పక మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, బలమైన పోషకాహారం తీసుకోవడం చేయాలి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ముఖ్యంగా మాస్క్ ధరించడంపై సినీ స్టార్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాస్క్ తప్పక ధరించండని ఓ ప్రచార చిత్రాన్ని చేశారు. అది జనాలని బాగా ఆకట్టుకుంటోంది.
తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కూడా మాస్క్ ప్రచారం చేశారు. అలాగని స్వయంగా షారుఖ్ రంగంలోకి దిగలేదు. ఆయన్ని అస్సాం పోలీసులు వాడుకుంటున్నారంతే. బాజీఘర్ చిత్రంలో షారూక్ చెప్పిన డైలాగ్‌తో అస్సాం పోలీసులు కరోనాపై పోరు చేపడుతున్నారు. ఇద్దరి మధ్య ఆరు ఫీట్ల దూరం ఉండాలన్న నిబంధన కోసం వారు.. చేతులు చాచిన షారూక్ ఫోటోను పోస్టు చేశారు. ఇక బాజీఘర్ చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను కూడా పోస్టు చేశారు. కబీ కబీ పాస్ ఆనే కే లీయే కుచ్ దూర్ జానా పడ్తా హై, ఔర్ దూర్ జాకర్ పాస్ ఆనే వాలోంకో బాజీగర్ కెహతే హై అంటూ బాజీఘర్ చిత్రంలో షారూక్ ఓ డైలాగ్ కొడుతాడు. ఇప్పుడు ఆ డైలాగ్‌నే అస్సాం పోలీసులు సోషల్ డిస్టాన్సింగ్ ప్రచారం కోసం వాడుతున్నారు. మొత్తంగా షారుఖ్ తో కరోనా సూచనలు చేస్తున్నారు అస్సాం పోలీసులు. ఇవి ప్రజలని బాగా ఆకట్టుకుంటున్నాయి.