అక్కడ థియేటర్స్ తెరచుకున్నాయ్

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఒక్క మదేశంలోనే కాదు. ప్రపంచం అంతట థియేటర్స్ బంద్ అయ్యాయ్. అయితే తాజాగా చైనాలో థియేటర్స్ తిరిగి తెరచుకున్నాయ్. అక్కడ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి.

షాంఘై, హాంగ్‌జోవ్‌, గుయిలిన్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అనే నిబంధనతో ప్రేక్షకులను థియేటర్లకు అనుమతిస్తున్నారు. వచ్చేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. అలాగే థియేటర్లలో మనిషికి, మనిషికి మధ్య ఓ సీటు ఖాళీ ఉంచుతున్నారు. కొన్ని థియేటర్లలో సీటు ఖాళీగా ఉంచకుండా… మధ్యలో టెడ్డీబేర్‌లు లాంటివి ఉంచుతున్నారు. మన దగ్గర థియేటర్స్ తిరిగి తెరచుకున్నా.. ఇలాంటి జాగ్రత్తలే పాటించాల్సి ఉంటుంది.