అలీకి జంధ్యాల పురస్కారం

హాస్య నటుడు అలీ జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా ‘జంధ్యాల హాస్యోత్సవం’ కార్యక్రమాన్ని ఆయన శిష్యులు ప్రదీప్, నరేష్, ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూమ్‌ యాప్‌ ద్వారా ఎనిమిది దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారాన్ని హాస్య నటుడు అలీకి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అలీ.. ‘జంధ్యాల నాకు వేషాలు కల్పించి ఇచ్చేవారు. జేబు చూసి డబ్బులు కూడా ఇచ్చేవారు. ఈ అవార్డు అందుకోవడం చిరస్మరణీయం’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.