మధ్యప్రదేష్ గవర్నర్ కన్నుమూత

అనారోగ్య కారణాలతో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ (85) ఈ ఉదయం కన్నుమూశారు. గతంలో కడుపులో అంతర్గత రక్తస్రావానికి సంబంధించి టాండన్‌కు శస్త్ర చికిత్స జరిగింది. శ్వాస ఇబ్బందులు, జ్వరంతో కొద్దిరోజులుగా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గవర్నర్‌ టాండన్‌ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అశుతోష్‌ టాండన్‌ వెల్లడించారు.లఖ్‌నవూ సమీపంలో చౌక్‌నవూ గ్రామంలో జన్మించిన టాండన్‌ 20 జులై 2019న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.