నెట్‌ఫ్లిక్స్ నుంచి హెచ్‌డీ స్ట్రీమింగ్‌తో కొత్త మొబైల్ ప్లాన్
కొవిడ్-19 కారణంగా ఇప్పుడు ఓటీటీల వినియోగం పెరిగింది. జనం సైతం హై క్వాలిటీలో వీడియోలు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ సరికొత్త మొబైల్ ప్లాన్ తీసుకొచ్చింది. మొబైల్+ పేరిట హెచ్‌డీ స్ట్రీమింగ్‌తో కొత్త మొబైల్ ప్లాన్‌ను నెట్‌ఫ్లిక్స్ త్వరలో తీసుకురాబోతోంది. ఇప్పటికే దీన్ని పరీక్షిస్తున్నట్లు సమాచారం. దీని ధరను రూ.349గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ప్లాన్‌లో హెచ్‌డీ కంటెంట్ వీక్షించడమే కాక మొబైల్, కంప్యూటర్, ట్యాబ్లెట్‌లోనూ వీక్షించవచ్చు. సాధారణ మొబైల్ ప్లాన్‌లో ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో మాత్రమే వీక్షించే వీలుంది. దీంతో పాటు డౌన్‌లోడింగ్ సదుపాయం కూడా ఈ కొత్త ప్లాన్ ఉంది. అయితే, ఒక్కసారి ఒక డివైజ్‌లో మాత్రమే వీక్షించే వీలుంటుంది.