కడియం శ్రీహరికి కరోనా

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రనిధుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివేకానంద్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌గుప్తా, సతీష్‌ కుమార్‌, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ లు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

కడియ శ్రీహరితో పాటు, ఆయన కారు డ్రైవర్, పీఏ, గన్ మెన్ లకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్టు తెలుస్తోంది. వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1430 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 47,705కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 703 కేసులు నమోదయ్యాయ్. కరోనా కారణంగా కొత్తగా ఏడుగురు మృతి చెందారు.  దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 429కి చేరింది.