నవంబర్’లో కరోనా వాక్సిన్.. ధర రూ. 1000

కరోనా మహమ్మారికి మందు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయ్. అన్నీ దేశాల్లోనూ కరోనా వాక్సీన్ తయారి వివిధ దశల్లో ఉంది. రష్యా మాత్రం వచ్చే నెలలోనే వాక్సిన్ ని తీసుకురాబోతున్నామని ప్రకటించింది. క్లినికల్ టెస్టులు ఆఖరి దశలో ఉన్నాయని తెలిపింది. బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసిన వాక్సిన్ రెండు దశల్లో మంచి ఫలితాలు ఇచ్చింది. మూడో దశ ట్రయల్స్ ను ప్రారంభించింది. నవంబర్ చివరికల్లా వాక్సిన్ ని తీసుకొస్తామని చెబుతోంది.

ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కోవిషీల్డ్ వాక్సిన్ ను ఇండియాలో పరీక్షించబోతున్నారు. భారత్ లో సీరమ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది. దీనికోసం సీరమ్ ఇన్స్టిట్యూట్ 200 మిలియన్ డాలర్ల ఖర్చు చేస్తున్నది. ఈ ట్రయల్స్ పూర్తి కావడానికి రెండున్నర నెలల సమయం పడుతుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. నవంబర్ చివరికల్లా వాక్సిన్ రెడీ అవుతోంది. దీని ధర ఒక్కో డోసు రూ. 1000 ఉంటుంద తెలిపింది.