పవర్ స్టార్ ట్రైలర్ లీక్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పంచ్ పడింది. ఆయన ‘పవర్ స్టార్’ పేరిట ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ని కూడా అమ్ముకోవాలని చూశాడు. ఒక్క వ్యూ కోసం రూ. 25 వసూలు చేశాడు. ఈ ఉదయం 11గంటలకే పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ కావాల్సివుంది. ఇప్పటికే ట్రైలర్ ని చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు.

ఇంతలో వర్మ కి షాక్ తగిలింది. పవర్ స్టార్ ట్రైలర్ లీకైంది. ఈ విషయాన్ని స్వయంగా వర్మనే చెప్పారు. అంతేకాదు.. ఇప్పటికే ట్రైలర్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. మరికొద్ది సేపట్లో ట్రైలర్ ని ఫ్రీ గా విడుదల చేస్తామని వర్మ ప్రకటించారు. మొత్తానికి.. పవర్ స్టార్ ట్రైలర్ తోనే భారీగా సంపాదించేదామని వర్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.