అయోధ్య రామాలయం నిర్మాణం ప్రారంభం అయితేనే కరోనా అంతం అవుతుందా ?

ఒక్క భారతదేశాన్ని మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలని కరోనా మహమ్మారి వణికిస్తోంది. వాక్సిన్ వస్తే తప్పా కరోనాకి చెక్ పెట్టలేమని వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా చెబుతోంది. అయితే మధ్యప్రదేశ్ ప్రోటెమ్ స్పీకర్, బీజేపీ నేత రామేశ్వర్ శర్మ మాత్రం అయోధ్య రామాలయం నిర్మాణం ప్రారంభం అయితేనే కరోనా అంతం అవుతుంది అంటున్నారు.

ప్రజాసంక్షేమం కోసం, రాక్షసులను సంహరించేందుకే శ్రీరాముడు అవతరించాడని, అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం ప్రారంభం అయిన క్షణం నుంచే కోవిడ్ మహమ్మారి కూడా కనుమరుగు అవుతుందని శర్మ అన్నారు. ఇక ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే. మరీ.. రామేశ్వర్ శర్మ మాటలు నిజమై.. ఆగస్టు 5 నుంచి కరోనా అంతం మొదలవుతుండేమో చూడాలి.