తెలంగాణలో భారీ వర్షాలు

భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దయింది. రాష్ట్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా మెదక్ కుల్చారం హలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మంచిర్యాల జనగాం, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలో 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నల్గొండ, కొమరం భీమ్, సిద్దిపేట , రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అత్యల్పంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 6.1 వర్షపాతం నమోదైంది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కుండపోత వర్షం పడింది. బుధవారం సాయంత్రం నుంచి అడపాదడపా వర్షం వచ్చిపోతుంది. ఈ ఉదయం నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. అయితే వర్షకాలంలో నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. భారీగా పెరిగిన చెట్లని, కరెంట్ తీగలకి అడ్డంగా పెరిగిన కొమ్మలని జీహెచ్ ఎంసీ కొట్టేయించింది. దీంతో విద్యుత్ అంతరాయం, ఇతర సమస్యల తీవ్రత కొత్త మేరకు తగ్గిందని చెప్పవచ్చు.