పవన్ అభిమానులపై వర్మ ఎదురుదాడి

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై దాడికి దిగాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ‘పవర్ స్టార్’ టైటిల్ తో సినిమా తీస్తున్నారు. ఈ వారమే (జులై 25) రిలీజ్. అయితే ఇప్పటి వరకు వదిలిన ప్రచార చిత్రాలు పవన్ కల్యాణ్ పరువు తీసేలా ఉన్నాయ్. పనిగట్టుకొని ఆయన్ని టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ప్రతిదాడికి దిగారు. ‘పవర్ స్టార్’ ట్రైలర్ కు అన్ లైకులు కొట్టేశాదు. అంతేకాదు.. ‘పరాన్నజీవి’ పేరుతో సినిమా తీస్తున్నారు. వర్మ పైత్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పరాన్నజీవి ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది. మాది దాడి కాదు. ప్రతిదాడి. సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తామని పవన్ ఫ్యాన్స్ హెచ్చరించారు. అలాగే వర్మకి సినిమా చూపిస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ హెచ్చరికలకి వర్మ కూడా జక్కడం లేదు. బస్తీమే సవాల్.. చూసుకుందాం అంటున్నారు.

తాజాగా మరో అడుగు ముందుకేసి.. తన ఆపీస్ అడ్రస్ కూడా ఇచ్చారు వర్మ. పవర్ స్టార్ కేవలం ఫిక్షన్ సినిమా మాత్రమే. ఎవర్ని ఉద్దేశించి తెరకెక్కించలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం తీసింది. అలాగే వార్నింగ్‌లు ఇస్తే భయపడడానికి ఇక్కడ ఎవడూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేను ఒక్కడినే ఉన్నా. నా ఆఫీస్ అందరికీ తెలుసు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా దొరుకుతుంది. రమ్మనండి ఎవరినైనా చూద్దాం అన్నారు వర్మ. మరీ.. నిజంగా పవన్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చి వర్మ ఆఫీసుపై దాది చేస్తే.. పరాన్నజీవి ప్రాణం పోయినట్టే. జర జాత్రత్త ఆర్జీవి.