అప్పుల బాధతో నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమ నుంచి మరో విషాదం. అప్పుల బాధతో టీవీ నటి మద్దెల సబీరా, అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరుకి చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి సీరియల్స్ లో నటించింది. అయితే కొద్దిరోజుల తర్వాత అవకాశాలు తగ్గడంతో తిరిగి గుంటూరికి వెళ్లిపోయింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొంది. వీరికి కుమార్తె పుట్టిన తర్వాత.. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడం విడిపోయారు. ఆ తర్వాత రేఖ చైతన్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పెళ్లి చేసుకుంది.
వీరు హైదరాబాద్ విద్యా నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే కొన్నాళ్లుగా చైతన్య వ్యాపారం డల్ అయింది. మరోవైపు పాటలు పాడటం, యాంకరింగ్ చేస్తున్న రేఖకి కరోనా కారణంగా పనిలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అప్పుల బాధలు ఎక్కువయ్యాయ్. దీంతో స్నానం కోసం బాత్రూమ్ లోకి వెళ్లిన రేఖ.. ఉరేసుకొంది. ఎంతసేపటికి బయటికి రాకపోవడం.. చైతన్య తలుపు పగలకొట్టి చూడగా.. రేఖ ఉరివేసుకొని కనిపించింది. దీంతో చైతన్య పోలీసులకి సమాచారమిచ్చారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఏమైన షాకింగ్ నిజాలు బయటికొస్తాయో చూడాలి.