వైరల్ : కేటీఆర్ బర్త్ డే సాంగ్

రామ నామ స్మరణతో తెలంగాణ మారుమ్రోగిపోతోంది. ఈరోజు మంత్రి కేటీఆర్ తన 45వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు, కార్యర్తల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్.. తదితరులు కేటీఆర్ ని విషె చేశారు.

మరోవైపు కేటీఆర్ బర్త్ డే సాంగ్ ని తీసుకొచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి యాదవ్. ఇందులో కేటీఆర్ ని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన వ్యక్తిత్వాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడీ సాంగ్ తెరాస శ్రేణులని బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.