నితిన్ పెళ్లిరోజు గిఫ్ట్ రెడీ


యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం (జులై 26) ప్రియురాలు షాలినీని పెళ్లాడబోతున్నారు. హైదరాబాద్ ఫలక్ నూమా ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. అయితే పెళ్లిరోజున అభిమానుల కోసం గిఫ్ట్ రెడీ చేశాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా టీజర్ ని నితిన్ పెళ్లిరోజున రిలీజ్ చేయబోతున్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి, సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ప్రస్తుతం టీజర్ పనిమీదే ఉన్నారు. కానీ టీజర్ లో ఒకటో రెండో డైలాగులు వుంటాయి. అవి డబ్బింగ్ చెప్పాలి. రెండు రోజుల్లో ఫెళ్లి పెట్టుకుని, నితిన్ డబ్బింగ్ కు రావడం కష్టమే. కానీ డబ్బింగ్ చెప్పేందుకు నితిన్ ఓకే చెప్పినట్టు తెలిసిందే. అంతేకాదు.. పెళ్లి కొడుకు వేడుక ప్రారంభానికి ముందే నితిన్ డబ్బింగ్ చెప్పేశాడని తెలిసింది. దీంతో నితిన్ పెళ్లిరోజు కానుకగా అభిమానులకి గిఫ్త్ రెడీ అయిపోయింది.