వెనక్కి తగ్గినా.. మళ్లీ మెరుగుతున్న వర్మ !
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘పవర్ స్టార్’ పేరిట సినిమా తీస్తున్న వర్మ పవన్ పై దాడికి దిగారు. పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పని పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రతిదాడికి దిగారు. ‘పరాన్నజీవి’ పేరిట ఆర్జీవి నీచ చరిత్రని చూపే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. పవన్ ఫ్యాన్స్ తనని ఏమీ చేయలేరు. కావాలంటే తన ఆఫీసుకు రమ్మనండి. తన ఆపీస్ అడ్రస్ అందరికీ తెలుసు. గూగుల్ లో వెతికినా తెలుస్తుందన్నారు. దీంతో గురువారం సాయంత్రం పవన్ ఫ్యాన్స్ వర్మ ఆఫీసుకు వెళ్లారు. వర్మతో మాట్లాడాలని హంగామా చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పవన్ ఫ్యాన్స్ పై వర్మ కేసు విత్ డ్రా చేసుకోవడం విశేషం. దీంతో వర్మ తగ్గారు. ఇక వివాదం సద్దుమణిగినట్టే అనుకున్నారంతా. కానీ తగ్గినట్టే తగ్గి మళ్లీ మెరుగడం మొదలెట్టాడు. పవన్ ఫ్యాన్స్ తన ఇంటికి రావడం వలన తనకి మేలే జరిగింది. పవర్ స్టార్ ట్రైలర్ కు కొత్తగా 30వేల వ్యూస్ పెరిగాయ్. థ్యాంక్స్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ట్విట్ చేసాడు వర్మ. మానుతున్న పుండుపై కారం చల్లడం అంటే ఇదే మరీ.. !
Hey P K Fans CHECK THIS OUT
This is all THANKS TO UR ATTACK ..Mmmmuuuahhhh
pic.twitter.com/NK0CORSjnN
— Ram Gopal Varma (@RGVzoomin) July 23, 2020