కరోనా చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం.. మరో వెయ్యి కోట్లు !

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 80వేలు దాడింది. మృతుల సంఖ్య 933కి చేరింది. అయితే కరోనా టెస్టులు, కరోనా రోగులకి చికిత్స అందిస్తున్న విషయంలో ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కరోనా చికిత్స కోసం మరో వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం జగన్ శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం సీఎం జగన్ కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలు కల్పిస్తున్నాం. అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా పనులు సాగుతున్నాయన్నారు. వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.