మరోసారి లాక్‌డౌన్ దిశగా కేంద్రం కసరత్తు ?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య 50వేలకి చేరువగా నమోదవుతున్నాయ్. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య లక్షకు చేరేలా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోసారి దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే దిశగా కసరత్తులు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయ్.

ప్రస్తుతం మనం అన్ లాక్ 2.ఓ లో ఉన్నాం. ఈ నెలాఖరుతో అది పూర్తికానుంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. మరీ.. ఈ సారి అన్ లాక్ 3.ఓ పై నిర్ణయం తీసుకుంటారా ? లేక ఓ 10-15రోజుల పాటు  లాక్‌డౌన్ విధించి కరోనాని కంట్రోల్ చేసే ఆలోచన చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.