కరోనాతో సామాజిక ఉద్యమ నేత ఊసా మృతి
సామాన్యులు, సెలబ్రిటీలు, సామాజిక ఉద్యమ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. వీరిలో కొందరు మృతి చెందుతున్నారు కూడా. తాజాగా దళిత, బహుజన హక్కుల కోసం పోరాడుతూ… తెలంగాణ ఉద్యమంలో, ఉపాధ్యాయుల ఉద్యమంలో ప్రతేక పాత్ర పోషించిన సామాజిక కార్యకర్త యు. సాంబశివరావు అలియాస్ ఊసా కరోనాతో కన్నుమూశారు.
ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఊసా.. సామాజిక కార్యకర్తగా సమాజంలో గుర్తింపు పొందారు. సామాజిక అనచివేతపై పోరాడిన ఊసా.. కరోనాపై గెలువలేకపోయాడు. ‘అమ్మను రమ్మని, పాలిచ్చి పొమ్మని, కాకితో కబురంపాను, ఆ కాకి చేరలేదో, కామందు పంపలేదో, మన అమ్మ రాలేదు, ఏడుపెక్కువయ్యే, అది వెక్కి వెక్కి ఏడ్చే’ లాంటి అజరామరమైన పాటలు రాసిన బహుజన సాహితీవేత్త సాంబశివరావు. ఆయన మృతి పట్ల పలువురు సామాజిక ఉద్యమ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.