అక్కినేని కోడలుగా స్టార్ యాంకర్

అక్కినేని ఫ్యామిలీలో మరొకరి చోటుంది. అక్కినేని అఖిల్ కి లైఫ్ పాట్నర్ రావాల్సివుంది. గతంలోనే అఖిల్ కి ఎంగేజ్ మెంట్ అయింది. అయితే అది పెళ్లి వరకు వెళ్లకుండా బ్రేకప్ అయింది. అయితే అఖిల్ పై మనసు పడింది యాంకర్ విష్ణు ప్రియ. మోడలింగ్ నుంచి బుల్లితెరకు పరిచయమైన విష్ణుప్రియ ‘పటాస్’ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. వరుస ఫోటో షూట్స్ చేస్తోంది. అయితే విష్ణు ప్రియకు అక్కినేని కోడలు కావాలనే ఆశ ఉందట. అఖిల్ అక్కినేని అంటే చచ్చేంత ఇష్టం. ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ అని తోటి యాంకర్ శ్రీముఖితో చెప్పిందట. ఏది లోపల దాచుకోని శ్రీముఖి ఈ మేటరుని లీక్ చేసింది. మరీ.. విష్ణు ప్రియ ఇష్టాన్ని అఖిల్ అర్థం చేసుకుంటాడేమో చూడాలి.