హైదరాబాద్ మేయర్’కు కరోనా పాజిటివ్
తెలంగాణలో ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు.
గతంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. అయితే తాజాగా విధుల నిర్వహణకు వెళ్లిన సమయంలో ఓ టీ దుకాణంలో మేయర్ ఛాయ్ తాగారు. టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా సోకిందని తెలియడంతో మేయర్‌కు మూడో సారి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అయితే మేయర్ ఆసుపత్రిలో చేరారా ? లేక ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది.
Am tested positive. Am up and active. No difficulty at all. Let’s face COVID with courage and not with fear. Do not get panic if you are tested positive. Thanks for your wishes for my well-being and fast recovery. 🙏@trspartyonline @TelanganaCMO@KTRTRS@arvindkumar_ias pic.twitter.com/4uiQov3g3g
— Dr BonthuRammohan,Mayor (@bonthurammohan) July 26, 2020