వైరల్ : నితిన్ పెళ్లి ఫోటోలు


యువ కథానాయకుడు నితిన్-షాలినిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో పరిమిత సంఖ్యలో బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరుగుతోంది. తాజాగా నితిన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటికొచ్చాయ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

షాలిని-నితిన్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయం అస్సలు బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు నితిన్. ఈ యేడాది మార్చిలో ప్రేమ గురించి బయటపెట్టాడు. వెంటనే నిశ్చితార్థం చేసుకున్నాడు. ముందుగా ఏప్రిల్ 16న నితిన్-షాలినీల పెళ్లి జరగనుంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక పెళ్లి డ్రెస్సులో నితిన్ మెరిసిపోతున్నారు. నితిన్-షాలినీలు ఫర్ ఫెక్ట్ జోడి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి ఫోటోలు, అంతకు ముందు చేసిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.