నితిన్ మ్యారేజ్ గిఫ్ట్ వచ్చేసింది

నితిన్-షాలినీల వివాహం హైదరాబాద్ ఫలక్ నూమా ప్యాలెస్ లో ఘనంగా జరుగుతోంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయ్. అయితే పెళ్లి చేసుకోవడానికి కొన్ని గంటల ముందే అభిమానులకి గిఫ్ట్ అందజేశారు నితిన్. ఆయన తాజా చిత్రం రంగ్ దే టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ ప్రజెంట్ పెళ్లి లింకు పెట్టి ఉండటం ఆకట్టుకుంది. టీజర్ లోనూ నితిన్ కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకొనే సీన్ ఉంది. ఈ సీన్ లో నితిన్ తనపై సటైర్స్ వేసుకున్నాడు.

సరిగ్గా తాని కడుతున్న టైమ్ లో బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే అనే సాంగ్ రావడం ఆకట్టుకుంది. ‘ఈ రోజుకు అదనపు ప్రత్యేకతను తీసుకొచ్చిన ‘రంగ్‌దే’ చిత్ర బృందానికి ధన్యవాదాలు. నా చిత్ర నుంచి అభిమానులు, స్నేహితుల కోసం ఈ ఫన్‌ టీజర్‌. ఆస్వాదించండి’ అంటూ టీజర్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు నితిన్.

ఈ చిత్రానికి తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.