సోష‌ల్ మీడియా వేధింపులు.. నటి ఆత్మాహత్యా యత్నం !

సోష‌ల్ మీడియా వేధింపులతో ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు త‌మిళ న‌టి విజ‌య‌ల‌క్ష్మి తన ఫేస్ బుక్ ఖాతాలో సెల్పీ వీడియోలో షేర్ చేసింది. కొన్ని పిల్స్ తీసుకుంటే రక్తపోటు తగ్గిపోయి మరణం సంభవిస్తుందని చెప్పి క‌ల‌క‌లం రేపారు. ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తలు నాలుగు నెల‌లుగా వేధిస్తున్నారు.

దీంతో నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. వాళ్ల దుర్మార్గాల నుంచి నాతో పాటు నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా’ అని మ‌ర‌ణ వాంగ్మూలం ఇచ్చిన‌ట్టుగా పేర్కొన్నారు. అయితే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని తెలిసింది.