అయోధ్య రామ మందిరంలో 2వేల అడుగుల లోతున !
ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ మందిరం నిర్మాణం గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపింది మందిర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. శ్రీరామ మందిరంలో రెండు వేల అడుగుల లోతున ఓ కాలనాళిక (టైమ్ క్యాప్సూల్)ను ఉంచనున్నారు. దీనిలో బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మందిరానికి సంబంధించిన చరిత్రను, వివరాలను తెలుసుకోవాలనుకునే రాబోయే తరాల వారికి ఈ ఏర్పాటు ప్రయోజనకరం కాగలదని ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ అన్నారు. భూగర్భంలో నిక్షిప్తం చేసే ముందు కాలనాళికను ఓ రాగిరేకు లోపల భద్రపరుస్తారు. ఇక రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజ కార్యక్రమంలో నలభై కిలోల వెండి ఇటుకను ఉపయోగించనున్నారు.