కరోనా సెల్ఫ్ చెక్ యంత్రాలని ప్రారంభించిన ఈటెల


కరోనా సెల్ఫ్ చెక్ యంత్రాలు వచ్చేశాయ్. వర్క్‌స్పేస్‌ ‌ మెటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ సంక్షేమశాఖకు అందజేసిన సెల్ఫ్‌ చెక్‌ కియోస్కి యంత్రాన్ని హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో మంత్రులు ఈటల, కొప్పుల ఈశ్వర్‌ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ కరోనా దృష్ట్యా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అందరూ భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందన్నారు.