విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్
మద్యప్రదేష్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్ చెప్పారు. 12వతరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అంస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఎంపిక చేసిన విద్యార్థులకి ఒక్కోక్కరికి రూ. 25వేలు అందించాలని అధికారులని ఆదేశించారు. 2019-20 విద్యాసంవత్సరంలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ ల్యాప్ టాప్ లని అందించనున్నారు.
ఇక కరోనా బారినపడిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రి నుంచే అధికారులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటర్ లో మెరిట్ స్టూడెంట్స్ కి ఉచితంగా ల్యాప్ టాప్ లు అందించాలని అధికారులని ఆదేశారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ తనకి కరోనా పాజిటివ్ అని తేలగానే.. ఇటీవల తనని కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలి. జాగ్రత్తగా ఉండాలని ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.