అత్యంత తీవ్ర ఎమర్జెన్సీని ప్రకటించిన WHO

కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1.6కరోనా కేసులు నమోదయ్యాయ్. అంతేకాదు.. కేవలం 6 వారాల్లోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయ్. గత నాలుగు రోజుల్లోనే 10లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా, భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా పరిస్థితులపై అత్యంత తీవ్ర ఎమర్జెన్సీ ప్రకటించింది.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రీసియస్ మాట్లాడుతూ.. ‘కరోనా కేసుల సంఖ్య ఆరు వారాల్లోనే రెట్టింపు కావడం కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సూచిస్తోంది. స్పెయిన్, బెల్జియం, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడక్కడ సెకండ్ వేవ్ కనిపిస్తోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం వారానికి 30 వేల నుంచి 40 వేల వరకు నమోదవుతుండడంలో పెద్దగా మార్పేమీ లేదు” అన్నారు.