దేశంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పదా.. ?
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 50వేలకి చేరువగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం అందుకు సిద్ధంగా లేదు. మరిన్ని సడలింపులకే మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం థియేటర్లకు, జిమ్‌లకు కూడా అనుమతిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తుండటం గమనార్హం.
అయితే లాక్డౌన్ తెచ్చే విషయాలపై మాత్రం రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తోంది. ఈ అవకాశాలను ఈశాన్య రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటుండటం గమనార్హం. తాజాగా త్రిపురలో కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మూడు రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది.
ఏపీలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. త్వరలోనే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ లో లాక్డౌన్ విధింపుపై సమాలోచనలు జరుగుతున్నాయ్. మొత్తానికి దేశం మొత్తం మరోసారి లాక్డౌన్ విధించకున్నా.. కరోనా ప్రభావం అధికంగా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్డౌన్ ని అమలు చేయబోతున్నాయి.