వర్మ ‘మర్డర్’ ట్రైలర్.. మాటల్లేవ్ !

కరోనా కారణంగా బడా నిర్మాణ సంస్థలు, బడా దర్శక-నిర్మాతలు ఖాళీ ఉంటున్నారు. ఐతే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వర్మ నుంచి క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ సినిమాలొచ్చాయ్. మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. థ్రిల్లర్, మర్డర్ సినిమాలు చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. తాజాగా మర్డర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు వర్మ.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ట్రైలర్ లో సింగిల్ డైలాగ్ కూడా లేకుండా స్టోరీ లైన్ చెప్పేశాడు వర్మ. యావత్ దేశానికి షాకిచ్చిన ఘటన ఆధారంగా అంటూ మొదలెట్టిన వర్మ. పలు ప్రశ్నలని సంధిస్తూ.. స్టోరీ లైన్ తో ట్రైలర్ కట్ చేశారు. కెమెరా వర్క్ అద్భుతం పిల్లలని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?? అనే ప్రశ్నలకి సంధించారు. ట్రైలర్ ని చూస్టే.. వర్మ అమృత తండ్రి మారుతి రావు యాంగిల్ లో కథని రాసుకున్నట్టు అనిపిస్తోంది.