ఏపీలో ఒక్కో కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థిక భద్రత
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనా విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం బాగా పని చేస్తోంది. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. ప్రతిపక్షాలు సైతం కరోనా విషయంలో ప్రభుత్వ పనితీరుని ప్రశంసిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అభినందించారు. తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు కరోనా విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వీడియో మెసేజ్ లని షేర్ చేశారు.
‘కరోనా విపత్తులో తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలచి విధులు నిర్వర్తిస్తోన్న వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. అలాంటి వారి త్యాగాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలి. వారికి తగిన రక్షణ, వారి కుటుంబాలకు భరోసాను ప్రభుత్వం కల్పించాలి. కరోనాను మొదటి నుంచీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. తీరా తీవ్రత పెరిగాక చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి. అధైర్య పడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం వద్దు. ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతోంది. అలాగే కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థిక భీమా తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.
ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతోంది. అలాగే కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలి pic.twitter.com/hhr2x8O84I
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 28, 2020