ఏపీలో భాజాపాకు స్వాత్రంత్య్రం వచ్చిందోచ్.. !

భాజాపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఏపీ భాజాపాకు ఇన్నాళ్లకి స్వాత్రంత్య్ర వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు.

ఎందుకంటే ? ఇన్నాళ్లు భాజాపాలోని కొందరు వ్యక్తులు ఏపీలో ఆ పార్టీని స్వాతంత్య్రంగా ఎదగనీయలేదనే విమర్శలున్నాయి. ఎల్లప్పుడూ తెదేపాకు సపోర్ట్ చేస్తూ.. ఆ పార్టీకి మేలు చేకూర్చారనే ప్రచారం ఉంది. అది నిజం కూడా. అయితే కొన్నాళ్లుగా ఏపీలో స్వంతంత్రంగా ఎదగాలని భావిస్తున్న భాజాపా ఆ దిశగా చర్యలు తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఎవ్వరికి లొంగని సోము వీర్రాజుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. వేరే ఇంకెవ్వరికైనా ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. వారిని భాజాపా ఎంపీ సుజనా, తదితరుల ప్రభావం ఉండేది. వారు మళ్లీ తెదేపాకి అనుకూలంగా వ్యవహిరించేవారు. అయితే సోము వీర్రాజు దగ్గర ఆ పప్పులేం ఉడకవ్. ఆయన రెబల్ క్యాండిడేటు. తెదేపా-భాజాపా సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి చుక్కులు చూపించారు. ఆయన సారధ్యంలో అయితే ఏపీ భాజాపా విజయపథంలో నడుస్తుందని ఆ పార్టీ అధిష్టానం బావించింది.