వైరల్ : సుశాంత్ చనిపోయే ముందు సోదరితో చేసిన వాట్సాప్ చాట్

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. ఈ షాక్ నుంచి సుశాంత్ అభిమానులు ఇంకా కోలుకోవడం లేదు. అయితే సుశాంత్‌ చనిపోయే నాలుగు రోజుల ముందు తన సోదరి శ్వేతాతో చేసిన వాట్సాప్‌ సంభాషణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్వేతా సుశాంత్ ని అమెరికా రావాల్సిందిగా కోరింది. ఇక్కడ ఓ నెలపాటు జాలిగా ఎంజాయ్ చేద్దాం. లాంగ్ డ్రైవ్ కి వెళదామని తెలిపింది. అయితే ఇంతలోనే సుశాంత్‌ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

“2007లో నాకు వివాహం అయింది. నేను అత్తారింటికి వెళ్లేటప్పుడు నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. ఆ తర్వాత నేను అమెరికా వచ్చేశా. తనూ బిజీ అయిపోయాడు. మమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఎప్పుడు మాట్లాడుకున్నా, అమెరికా రమ్మన్ని అడుగుతూ ఉండేదాన్ని. ఇప్పటికీ తను నా కళ్లముందే కదలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇదంతా ఒక పీడకలలా అనిపిస్తోంది” అని శ్వేత ఓ ఇంటర్ప్యూలో చెప్పుకొచ్చారు. ఇక సుశాంత్ నటించిన ఆఖరి చిత్రం దిల్ ‘బేచారా’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సినిమా అనిపించుకొంది. ఇందులో సుశాంత్ నటనకి ప్రశంసలు కురుస్తున్నాయి.