నిహారిక నిశ్చితార్థం.. డేటు ఫిక్స్ !
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగ్రనున్న సంగతి తెలిసిందే. మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి ఫిక్సయింది. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యని నిహారిక పెళ్లి చేసుకోనుంది. తాజాగా వీరి నిశ్చితార్థ వేడుకకి డేటు ఫిక్సయింది. నిహారిక తండ్రి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థ వేడుక నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
తన స్టార్‌బక్స్ కాఫీ కప్పు ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన నిహారిక.. దానిపై నిహా (మిస్‌ని కొట్టివేసి) మిసెస్..? దీంతో నిహారిక పెళ్లి ఫిక్సయిందని అర్థమైపోయింది. ఆ తర్వాత కాబోయే వాడితో దిగిన ఫోటోలని నిహారిక షేర్ చేసింది. ఇక ఇటీవల చైతన్య పుట్టినరోజు సందర్భంగా నిహారిక ప్రేమ కవిత రాసింది.
“నీ నవ్వు గది మొత్తం వెలుగు నింపుతుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. నీ నవ్వు నా సంతోషపు చిరునామా. అన్నింటి కన్నా నువ్వు ఉత్తమమైనవాడివి. హ్యాపీ బర్త్‌డే చై” అని నిహారిక శుభాకాంక్షలు చెప్పింది. మొత్తానికి పెళ్లికి ముందే కాబోయే వాడిపై ప్రేమని ఒలకబోస్తోంది.