ప్రైవేటు హాస్పటల్ లో కరోనా చికిత్స ఒక్కో రోజుకి రూ. 10లక్షలు
తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్స పేరిట లక్షల రూపాయాలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వంపై పలుమార్లు ఫైర్ అయింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా.. పైవేటు ఆసుపత్రుల ఆగడాలు రోజుకోటి వెలుగులోనికి వస్తూనే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్ లో సోమాజిగూడా డెక్కన్ ఆసుపత్రి కరోనా పేషెంట్ నుంచి రోజుకి పది లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. కరోనా వ్యాధితో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి 10 రోజుల క్రితం సోమజిగూడా డెక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరాడు. అయితే అక్కడ ఒక్క రోజుకి లక్ష కి పైగా వసూళ్లు చేసింది డెక్కన్ ఆసుపత్రి మ్యానేజ్మెంట్. 10 రోజులకు 17.5 లక్షల బిల్లు వేశారు. అందులో 8లక్షలు సత్యనారాయణ రెడ్డి కుటుంబసభ్యులు కట్టారు.
అయితే నిన్న సత్యనారాయణ రెడ్డి భార్య కరోనా తో మృతి చెందింది. ఈ విషయం తెలియడం తో సత్యనారాయణరెడ్డి కూడా నిన్న మృతి చెందాడు. అయితే మరో 8లక్షలు కడితేనే సత్యనారాయణ మృతదేహం ఇస్తామని ఆసుపత్రి మ్యానేజ్మెంట్ సత్యనారాయణరెడ్డి కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. దీంతో సత్యనారాయణ రెడ్డి కుటుంబం మీడియాని ఆశ్రయించడంతో.. ఈ విషయం వెలుగులోనికి వచ్చింది.