ఆ రెండు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 50వేలు దాటేసి 60వేలకిపైగా నమోదవుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగారాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ ని విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే అందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అంతేకాదు.. అన్ లాక్ 3.ఓ లో భాగంగా మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జిమ్ సెంటర్లు, థియేటర్లకి కూడా త్వరలోనే అనుమతులు రాబోతున్నాయని సమాచారమ్.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్‌డౌన్ పై నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలో లాక్‌డౌన్ ని అమలు చేస్తున్నారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా లాక్‌డౌన్ ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేష్ రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో రేపటి (జులై 30) నుంచి పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ పాటించనున్నారు. మొదట ఆగస్టు 4వ వరకు మాత్రమే లాక్‌డౌన్ అని ప్రకటించిన మధ్య్రప్రదేష్ ప్రభుత్వం ఆ తర్వాత మరిన్ని రోజులు పొడిగించనుందని తెలుస్తోంది. ఇక కోల్‌కతాలో ఎక్కడికక్కడ బంద్ పాటిస్తున్నారు. వాహనాలను తిరగనివ్వడం లేదు. అంతేకాదు.. ప. బెంగా లో రెండ్రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ని అమలు చేస్తున్నారు. ప. బెంగాల్, మధ్య్రప్రదేష్ తరహా మరిన్ని రాష్ట్రాలు సంపూర్ణ  లాక్‌డౌన్  ని ఆశ్రయించక తప్పేలా లేదని విశ్లేషకులు చెబుతున్నారు.