వర్మకు మరోసారి ఫైన్ పడింది
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 24గంటల వ్యవధిలోనే రెండు ఫైన్స్ పడ్డాయి. ఆయన కరోనా టైమ్ లోనూ చకచకా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పకే వర్మ నుంచి క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ సినిమాలొచ్చాయ్. మరో రెండు సినిమాలు థ్రిల్లర్, నగ్నం సినిమాలు రెడీ అవుతున్నాయి.
అయితే పవర్ స్టార్ సినిమా విషయంలో కరొనా నిబంధనలు పాటించకుండా హైదరాబాద్ నగరంలో పోస్టర్స్ అంటించడంపై జీహెచ్ ఎంసీ రూ. 4వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చలానాని బుధవారం వర్మకు పంపింది. తాజాగా నిబంధనలకి విరుద్ధంగా పవర్ స్టార్ సినిమా పోస్టర్స్ వేయించాడని సెంట్రల్ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ కూడా ఆర్జీవీకి భారీ ఫైన్ వేసింది. 88వేల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన చలానా వర్మకి పంపింది. మొత్తంగా పవర్ స్టార్ సినిమా విషయంలో వర్మకు 92వేల ఫైన్ పడినట్టయింది.