టాలీవుడ్’కు మరో నెల సెలవు
త్వరలోనే థియేటర్స్ తెరచుకోబోతున్నాయి. 25 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరచుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అన్ లాక్ 3.ఓ లో భాగంగా థియేటర్స్ కి గ్రీన్ సిగ్నల్ రాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ, కేంద్రం రిలీజ్ చేసిన అన్ లాక్ 3.ఓ లో థియేటర్స్ కి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు మరో నెలరోజుల సెలవులు పొడగించినట్టయింది.
మార్చి చివరి వారం నుంచే థియేటర్స్, షూటింగ్స్ బంద్ అయ్యాయ్. అయితే ఇటీవల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చినా.. ఎవరి దైర్యం చేసి పని మొదలెట్టలేదు. ఇప్పుడు థియేటర్స్ తెరవడానికి కూడా మరో నెల సమయం పెట్టేలా ఉన్న నేపథ్యంలో అప్పడే షూటింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఇక దసరా వరకు థియేటర్స్ ఓపెనింగ్ కి అనుమతులు లభిస్తే చాలు. ఇప్పటికే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు దసరా కానుకగా రిలీజ్ అయిపోతాయని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.